అనంతపురం జిల్లా నంబులపూలకుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. నాడు- నేడు కార్యక్రమం లో భాగంగా అదనపు గదుల నిర్మాణానికి రూ,1.17కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం మండల పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు.
ఇదీ చదవండి: