కరోనా వైరస్ రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున అనంతపురం జిల్లా కదిరిలో కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలు బయటికి రావాలని డీఎస్పీ భవ్య కిషోర్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర సేవలు మినహా… మిగతావాటికి అనుమతి లేదని ఆమె అన్నారు. కర్ఫ్యూ వేళల్లో మార్పు లేదని ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు ధరించని 13 వేల మందికి జరిమానా వేశామని వెల్లడించారు. సరైన కారణం లేకుండా బయటికి వచ్చిన 175 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు ,రెండు కార్లను జప్తు చేశామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ఇదీ చూడండి.