ETV Bharat / state

AWARD: కదిరి సీఐకు హోంమంత్రి ఎక్స్​లెన్స్ అవార్డు - కదిరి సీఐకు హోంమంత్రి ఎక్స్ లెన్స్ అవార్డు

హోంమంత్రి ఎక్స్​లెన్స్ అవార్డును కదిరి సీఐ తమ్మిశెట్టి మధు అందుకోనున్నారు. ఉత్తమ సేవలు అందించడంతో పాటు నేర పరిశోధన చాటిన పోలీసులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో ఐదుగురు అధికారులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

kadiri ci select for home minister excellence award

author img

By

Published : Aug 13, 2021, 12:19 PM IST

అనంతపురం జిల్లా కదరి సీఐ తమ్మిశెట్టి మధు హోం మంత్రి ఎక్స్​లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవలు అందించడంతో పాటు సంచలనం రేపిన కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన వారికి ఎక్స్​లెన్స్ ఆవార్డును ప్రదానం చేస్తారు. ఈ నెల 20న కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన సర్టిఫికెట్ సహా.. కాపర్-నికెల్ మిశ్రమాలతో తయారు చేసిన మెడల్​ను ఆయన అందుకోనున్నారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని సీఐ అన్నారు.

ఛేదించిన కేసులు ..

  • తనకల్లు మండలం కొర్తికోటలో సంచలనం రేపిన ముగ్గురి హత్య కేసుతో పాటు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో తల్లే కన్నకొడుకును కిరాయి హంతకులతో హత్య చేయించిన కేసును సీఐ మధు ఛేదించారు.
  • మారుమూల ప్రాంతమైన శివాలయం వద్ద ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలతో విభిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. సుమారు 8 నెలల తర్వాత కేసును ఛేదించి నిందితులను కటకటాలకు పంపారు.
  • కొర్తికోట శివాలయం వద్ద జరిగిన హత్య, నల్లచెరువు వద్ద ముగ్గురి హత్య, పూలోల్లపల్లి వద్ద యువకుడి హత్య కేసులను తక్కుత సమయంలోనే ఛేదించారు.

ఇదీ చదవండి: DRC meeting: రసాభాసగా అనంతపురం డీఆర్సీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.