భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు జాతి ముద్దుబిడ్డ జస్టిస్ ఎన్వీ రమణకు... అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ చిత్రకారుడు కళా నీరాజనం పలికారు. దేశ పటంపై జస్టిస్ ఎన్వీ రమణ చిత్రాన్ని బాల్ పెన్నుతో గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు జాతికే జస్టిస్ ఎన్వీ రమణ గర్వకారణంగా నిలిచారన్న చిత్రకారుడు శేషాద్రి ...ఎన్నో రోజులు శ్రమించి ఆయన బొమ్మ గీశానని చెప్పారు.
ఇదీ చదవండి: నిలువ నీడ లేని వృద్ధుడు..ఇంటి కోసం ఎదురుచూపు