ETV Bharat / state

కార్మికులను ఆదుకున్న జూనియర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ - dhramavaram junior ntr fans Vegetables distribution news

ధర్మవరంలో పట్టు చీరలపై డిజైన్లు వేసి కుటుంబాలను పోషించుకునే కోల్​కతా కార్మికులు లాక్​డౌన్​ కారణంగా గత పది రోజులుగా ఉపాధిని కోల్పోయారు. చేసేందుకు పనులు లేక ఆకలితో అలమటిస్తున్న వారిని జూనియర్​ ఎన్టీఆర్​ అభిమాన సంఘం ఆదుకుంది. పట్టణ మున్సిపల్​ కమిషనర్​ చేతుల మీదుగా వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

కార్మికులను ఆదుకున్న జూనియర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​

author img

By

Published : Apr 4, 2020, 10:01 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో పట్టు చీరలపై డిజైన్లు వేసి... కుటుంబాలను పోషించుకునే కోల్​కతా కార్మికులు పది రోజులుగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఆ సమాచారం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు అతని మిత్ర బృందం కలిసి 200 మంది కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను అందజేశారు. సామాజిక దూరం పాటిస్తూ కనిపించిన కార్మికులను కమిషనర్ అభినందించారు.

ఇదీ చూడండి:గుత్తికోటలో పేదలకు కూరగాయల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.