JC Prabhakar reddy: వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించే సీఎం జగన్.. వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారని తెదేపా సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావొచ్చన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన సీఎం అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నిన్న పవన్ పర్యటనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందిచారు. కౌలురైతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను మేలుకొలిపే కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని కోరారు. అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు.
ఇదీ చదవండి: 'కాదేది బాదుడుకు అనర్హం' అన్నట్లుంది వైకాపా తీరు: లోకేశ్