కదిరిలో ఐకాస సభ్యుల వినూత్న నిరసన - కదిరిలో ఐకాస సభ్యుల వినూత్న నిరసన
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో ఐకాస సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో మోకాళ్ల పై నిలబడి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండున్నర నెలలుగా అమరావతి కోసం ఆందోళనలు చేపడుతున్నా.. జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఐకాస సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నే రాజధానిగా కొనసాగించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.