ETV Bharat / state

గోదాముల్లోనే పుస్తకాలు.. సందేహాల నివృత్తి ఎలా? - govt intermediate text books supply

కరోనా కారణంగా కళాశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో.. కళాశాలలు తెరిచే అవకాశం లేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలను అందించలేకపోతున్నారు అధికారులు

text books sucked in godowns at anantapur
ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు అందని పాఠ్య పుస్తకాలు
author img

By

Published : Sep 7, 2020, 11:24 AM IST

అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. కొవిడ్‌ కారణంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో కనీసం పాఠ్యపుస్తకం అందిస్తే ఇంటి వద్దే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకం అందిస్తే ప్రయోజనం చేకూరుతుంది.

పుస్తకాలు అందలేదు

ప్రథమ ఇంటర్‌లో 28, ద్వితీయ ఇంటర్‌లో 28 పాఠ్యపుస్తకాలు అందివ్వాలి. ఇందులో ఇంకా ఆరు రకాల పుస్తకాలు అందలేదు. ముఖ్యమైన పాఠ్యపుస్తకాలే సరఫరా చేయలేదు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి చరిత్ర పుస్తకాలు 2,331 అవసరం కాగా.. ఒక్కటీ సరఫరా కాలేదు. ఉర్దూ పుస్తకాలదీ అదే పరిస్థితి. ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి పాఠ్యపుస్తకాలు అందిస్తేనే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ ఆంగ్లం పుస్తకాలు 12,805, వృత్తివిద్య 3,129, గణితం-2బి 2,300, భౌతికం 4,144 పుస్తకాలు అవసరం కాగా ఒక్కటీ అందలేదు.

గోదాములోనే నిల్వ

అనంతపురం కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పాఠ్యపుస్తకాల గోదాము ఏర్పాటు చేశారు. గోదాములోనే ఇంకా సగానికి పైగా పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఇప్పటిదాకా సుమారు 30 కళాశాలలకు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విషయంపై వృత్తి విద్య అధికారి బాలప్పను అడగ్గా వచ్చిన పుస్తకాలను వేగంగా సరఫరా చేస్తున్నామనీ... ఇంకా కొన్ని రీడర్లు రావాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.