Income tax ride : శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో వడ్డీ వ్యాపారి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. అధిక ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పట్టణంలోని మారుతీ నగర్‌కు చెందిన వ్యాపారి ఇంట్లో సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోమవారం రాత్రి పొద్దుపోయే దాకా తనిఖీలు చేపట్టిన అధికారులు... రెండో రోజు మంగళవారం కూడా సోదాలు కొనసాగించారు. స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు వ్యాపారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి :