ETV Bharat / state

అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట.. అనుమతి లేని వాటి రిజిస్ట్రేషన్ల నిలిపివేత - ధర్మవరంలో అక్రమ లేఅవుట్ల వార్తలు

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, భూ బదలాయింపు (ల్యాండ్‌ కన్వర్షన్‌) చేయకుండా ప్లాట్లుగా విభజించి కొందరు స్థిరాస్తి వ్యాపారులు వాటిని విక్రయిస్తున్నారు. వీరి గురించి పురపాలక, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు, రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులకు తెలిసినా తమకు అందే మాముళ్లతో ఉదాసీనంగా కొందరు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇటీవల అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో పట్టణాల్లో వేస్తున్న ప్రతి వెంచరుకు తప్పకుండా పట్టణ ప్రణాళిక శాఖ ద్వారా అనుమతులు పొందాల్సిందే. ఇదివరకే వెలసిన అక్రమ లేఅవుట్లను పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు.

illegal layouts
అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట
author img

By

Published : Oct 5, 2020, 2:48 PM IST

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆపార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో స్థిరాస్తి వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా ఏర్పాటు చేస్తూ.. మూడు పూలు.. ఆరు కాయలుగా తమ వ్యాపారం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెలసిన వెంచర్లలో ప్లాట్ల క్రయ విక్రయాలు చేయకుండా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీంతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపి వేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు కఠినంగా ఉండటంతో వెంచర్ల యజమానులు ముందుకు రావడం లేదు. మరో వైపు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం భూములను క్రమబద్ధీకరించుకోకపోతే స్వాధీనం చేసుకోవాల్సి వస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో స్థిరాసి వ్యాపారులు చిక్కుల్లో పడ్డారు.

అనంతపురం జిల్లా ధర్మవరం పురపాలక పరిధిలో 80 వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించారు. సంబంధిత వ్యక్తులకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. వీరిలో 43 మంది ఎల్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు రెండు దరఖాస్తులు అప్రూవ్‌ చేశారు.

కదిరి మున్సిపాలిటీలో 35 వెంచర్లు అక్రమంగా వెలసినట్లు పట్టణ ప్రణాళికాధికారులు గుర్తించారు. వీటిలో 15 మంది ఎల్‌ఆర్‌సీకి దరఖాస్తులు చేసుకున్నారు. 9 వెంచర్లకు అప్రూవల్స్‌ కూడా మంజూరు చేశారు.

నోటీసులు జారీ చేశాం

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వెలసిన 80 వెంచర్లు గుర్తించాం. వీటి యజమానులకు నోటీసులు అందించాం. తప్పకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అప్రూవల్స్‌ ఉన్న వాటినే రిజిస్టర్‌ చేయాలని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నివేదిక పంపించాం. వెంచర్‌ యజమానులు తప్పనిసరిగా ఎల్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకోవాలి. - నాగవల్లి, పట్టణ ప్రణాళికాధికారి,ధర్మవరం

ఇవీ చదవండి:

'సీఎం జగన్ ప్రతిపక్షాలతో పాటు ప్రజలపైనా కోపం చూపిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.