ETV Bharat / state

అనంత సర్వజన ఆసుపత్రిలో ప్రైవేట్ దందా...! - arogyasri

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు... చికిత్స మధ్యలో ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలకు వెళ్లిపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని వైద్యులు ఆలోచిస్తున్నా... రోగులు ప్రైవేటు వైద్యం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను బయటి నర్సింగ్‌హోంలకు తరలిస్తున్న వ్యవహారంపై... నిఘాపెట్టాలని జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలను వైద్యులు కోరారు.

అనంత సర్వజన ఆసుపత్రిలో ప్రైవేట్ దందా...!
author img

By

Published : Nov 7, 2019, 6:45 AM IST

అనంత సర్వజన ఆసుపత్రిలో ప్రైవేట్ దందా...!

అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం... ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్‌, ఎమ్మెల్యేకు వైద్యులు వివరించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కీళ్లు, ఎముకల విభాగానికి శస్త్రచికిత్స కోసం వచ్చిన రోగులు... రక్తం ఎక్కించుకున్న తర్వాత చెప్పకుండా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారని... ఆ విభాగాధిపతి డాక్టర్‌ ఆత్మారం వివరించారు.

వెళ్లే రోగులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించకుండా... చేయాలని కలెక్టర్‌ను కోరారు. కొందరు వైద్యులే సొంతంగా నర్సింగ్‌హోంలు నిర్వహిస్తూ... ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను... అక్కడకి తీసుకెళ్తున్నారని ఆత్మారాం వివరించారు. ఈ విషయంపై నిఘాపెట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు.

చిన్నారులు, గైనిక్‌ విభాగంలో సౌకర్యాలు మెరుగుపరచకపోతే... వైద్యసేవలు అందించడం కష్టమని ఆ విభాగ వైద్యులు మల్లీశ్వరి, సంధ్య పాలనాధికారి, ఎమ్మెల్యేకు వివరించారు. వివిధ విభాగాల్లో ఉన్న సమస్యలను... వైద్యులు అభివృద్ధి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో మందుల కొరత... అనవసర మందుల నిల్వలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వైద్యులతో మాట్లాడారు. మందులు కాలం తీరిపోవడానికి గల కారణాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆసుపత్రిలో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని... ఆసుపత్రి సూపరింటెండెంట్​ను జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ఆదేశించారు. సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదనలు పంపిస్తే... నిధులు విడుదల చేస్తామన్నారు.

ఇదీ చదవండీ... అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... నేటి నుంచి చెల్లింపులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.