గుంతకల్లుకు చెందిన అబ్రహం లింకన్ కు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సరళకు 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఎలక్ట్రీషియన్‌గా పని చేసే అబ్రహం మద్యానికి బానిస కావడంతో కుటుంబ పోషణ భార్య సరళ పై పడింది. బెంగుళూరులో దినసరి కూలీగా పని చేసి కుటుంబాన్ని నెట్టుకు వస్తుంది. తరచూ భర్త అదనపు కట్నం, కోసం భార్యతో గొడవ పడుతూనే ఉండేవాడు. చీటి డబ్బుల కోసం భార్యతో గొడవ పడ్డ భర్త గొంతు నులిమి హత్య చేశాడు. గొడవ జరుగుతున్న సమయంలో తల్లికి ఫోన్ చేసిన మృతురాలు తనను బెల్ట్‌తో కొడుతున్నాడని, గొంతు నులిమి హింసిస్తున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయింది. అనంతరం కొంత సేపటికి సరళ ఆత్మహత్య చేసుకుందని అల్లుడు ఫోన్ చేశాడని మృతురాలి తల్లి సుబ్బమ్మ తెలిపింది. అనుమానాస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. భార్యను గొంతు నులిమి తానే హత్య చేసినట్లు అబ్రహం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...