అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని హిందూపురం ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఆక్రమణల తొలగింపులో భాగంగా ఇంటి యజమానులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న కారణంగా... కొందరు యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏడాదిపాటుగా విస్తరణ పనులు వాయిదా పడుతూ వచ్చాయి. భవన యజమానులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు నిలవడంతో అధికార విపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు దారి తీసింది.
అందరి అంగీకారంతో 60 అడుగుల మేర రోడ్డు వేసేందుకు ఒప్పందం కుదరడంతో విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. కొందరు భవనాల యజమానులు స్వయంగా ఆక్రమణలు తొలగించుకున్నారు. మిగతా వాటిని అధికారులు తొలగిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా భారీగా పోలీసులను మోహరింపజేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు విస్తరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: