అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా వర్షం పడుతున్న కారణంగా.. కొంత మేర ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినట్లైంది. తాజా వర్షం.. ఈ సారి ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. దుక్కి దున్నుకోవడానికి ఈ వర్షం ద్వారా మంచి అవకాశం వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: