ETV Bharat / state

వర్షాలతో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు

author img

By

Published : Sep 30, 2020, 4:51 PM IST

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుత్తి పట్టణ సమీపంలోని గాంధీ నగర్ దగ్గర ఉన్న వాగు పూర్తి స్థాయిలో ప్రవహిస్తోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

heavy rain
heavy rain

అనంతపురం జిల్లా గుత్తి మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలోని 63వ నెంబరు జాతీయ రహదారి దగ్గర ఉన్న మరువ వంక ఉప్పొంగి పారుతుంది. రహదారిపై ఉన్న గుంతలో కారు చిక్కుకుంది. గుంతకల్లు - గుత్తి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వంకలో చిక్కుకున్న కారును పోలీసులు బయటికి తీశారు.

కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడారు. ఈ రహదారిలో నిరంతరం వేలకొద్ది వాహనాలు ప్రయాణిస్తున్నా.. అధికారులు మాత్రం గుంతలకు మరమ్మత్తులు చేపట్టకపోవడంవల్లే.. తరుచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన పనులు చేపడితే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.