ETV Bharat / state

గుంతకల్లు రైతుల కథ సుఖాంతం - పవన్ ఫార్మర్స్ వేర్​హౌస్ వార్తలు

గోదాములో చిక్కుకుపోయిన ధాన్యాన్ని తమకు ఇప్పించాలని 63వ జాతీయ రహదారిపై గుంతకల్లు రైతులు చేసిన ఆందోళన ఫలించింది. అధికారులు దిగివచ్చి.. రైతుల ధాన్యాన్ని అప్పగించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

farmers
గుంతకల్లు రైతుల కథ సుఖాంతం
author img

By

Published : Aug 7, 2020, 10:12 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఉన్న పవన్ ఫార్మర్స్​ వేర్​హౌస్​లో ధాన్యం నిల్వ ఉంచి... కష్టాల పాలైన అన్నదాతల కథ సుఖాంతం అయ్యింది. గోదాము యాజమాన్యం ఎన్​సీఎమ్​ఎల్ సంస్థ ద్వారా బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు చెల్లించలేదు. అంతేకాకుండా గోదాము యాజమాన్యం కనిపంచకుండా పోయింది. దీంతో ఎన్​సీఎమ్ఎల్ సంస్థ ముందుజాగ్రత్తగా... పవన్ ఫార్మర్స్​వేర్ హౌస్​కి గత కొంతకాలంగా తాళాలు వేసి ఉంచింది. దీంతో గోదాములో పండిన పంటను నిల్వ ఉంచిన రైతులు ఆందోళనకు గురయ్యారు. గోదాములో ఉన్న తమ పంటను ఇచ్చేయాలంటూ.. రైతులు పది రోజులుగా గోదాము చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కడుపు మండిన అన్నదాతలు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.

రైతుల చర్యతో పోలీసు అధికారులు దిగివచ్చారు. పోలీసులు ఎన్​సీఎమ్ఎల్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. వారు స్పందించలేదు.

దీంతో పోలీసులు రెవిన్యూ, మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చివరకు రైతుల సమస్య పరిష్కారం చేయటానికి స్టాక్​కు సంబంధించిన బాండ్ పేపర్లు ఉన్న రైతులతో నోటరీ రాయించారు. తహసీల్దార్, పోలీసులు, వైకాపా నాయకుల ఆధ్వర్యంలో గోదాము తెరిపించారు.

గోదాములో చిక్కుకున్న తమ ధాన్యం సరిగ్గా విత్తనం వేసే సమయానికి బయటకు రావటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ధాన్యం బయటకు రావటానికి సహకరించిన పోలీస్,రెవెన్యూ, ఈటీవీ భారత్​కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: 'అనంత' విషాదం.. 7 నెలల బాలుణ్ని జ్వరం మింగేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.