అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం నంబులపూలకుంట రైతులు.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ విత్తన వేరుశనగ సరఫరా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. నాసిరకం కాయలను ఇస్తున్నారంటూ రైతులు వ్యవసాయశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు.
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోందని ఇలాంటి సమయంలో నాణ్యతలేని కాయలను పంపిణీ చేసి రైతులను నష్టాల పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన కాయలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రైతులకు నచ్చచెప్పి పంపించారు.
ఇదీ చదవండి: