ETV Bharat / state

ఖరీఫ్ నాటికి రైతులకు వేరశనగ విత్తనాల పంపిణీ

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని విత్తన వేరుశనగకాయలను మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. ఈ నెలఖారు వరకు రైతులకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

groundnut famers market vists minister sankarnarayana in anantapur dst

author img

By

Published : May 6, 2020, 8:14 PM IST

నెలాఖరులోగా వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహయసహకార పరిమితి సమాఖ్య కేంద్రంలో సేకరించిన విత్తన వేరుశనగకాయలను మంత్రి పరిశీలించారు.

వేరుశనగ ఉత్పత్తిలో అనంతపురం జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.పెనుకొండ మండలంలోని రైతు సమాఖ్య కేంద్రంలోనే 4వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను సేకరించినట్టు వివరించారు.

రైతు చెంతకు రైతు విత్తనం పేరిట... ఇప్పటికే 1.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సేకరించామని మంత్రి చెప్పారు. సమృద్ధిగా విత్తనాలు సేకరించి... మే నెలాఖరులోగా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తామని వివరించారు.

ఇదీ చూడండి స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.