అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో రెండు కోతులు పోట్లాడుకున్నాయి. ఈ ఘటనలో ఒక మర్కటం మృతి చెందింది. మున్సిపాలిటీ, ఆటో కార్మికులు ఆ మర్కటానికి పూజలు చేసి అంత్యక్రియలు జరిపారు. పట్టణ ప్రజలు మాత్రం రోడ్లపై పలు కాలనీల్లో కోతుల గుంపుగా వచ్చి...ఇళ్లల్లో చొరబడి విధ్వంసాలు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మర్కటాల బెడద తగ్గించాలని అధికారులను కోరుతున్నారు. ఏదీ ఏమైనా... ఆ కోతికి ఘనంగా వీడ్కోలు పలికిన కార్మికులను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: బొలారో ఢీ కొట్టి 11 గొర్రెలు మృతి