ETV Bharat / state

బ్లాక్‌ ఫంగస్‌తో మనువడు.. గుండెపోటుతో అవ్వ మృతి - బ్లాక్‌ఫంగస్‌ మరణాల వార్తలు

మనవడి మరణం.. అతని అవ్వని మనో వేదనకు గురి చేసింది. కరోనా, ఆపై బ్లాక్​ ఫంగస్​ సోకి మనవడు మృతి చెందటంతో... తట్టుకోలేని ఆ అవ్వ గుండె ఆగిపోయింది. రెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించటంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలోని శ్రీరంగాపురం క్యాంపులో ఈ ఘటన జరిగింది.

died person
మరణించిన వ్యక్తి
author img

By

Published : May 31, 2021, 10:47 AM IST

బ్లాక్‌ఫంగస్‌తో చికిత్స పొందుతూ తొలుత మనవడు, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అవ్వ మృతి చెందటంతో స్థానికంగా విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలోని శ్రీరంగాపురం క్యాంపునకు చెందిన కె.రవి కుమార్‌ (35) ఆదివారం కరోనా, బ్లాక్‌ ఫంగస్‌తో బెంగళూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క మనుమడు దూరమయ్యాడని ఆవేదన చెందిన అతడి అవ్వ గంగమ్మ (75) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.

రవికుమార్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. మొదటగా కరోనా లక్షణాలు రావటం, మళ్లీ బ్లాక్‌ఫంగస్​ కళ్లు, ముక్కుకు సోకడంతో పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వైద్యబృందం తెలిపారు. అతడి స్వగ్రామమైన శ్రీరంగాపురం క్యాంపులోని సొంత పొలంలో అంత్యక్రియలు చేశారు. రెండు గంటల వ్యవధిలోనే అవ్వ కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి:

గుడ్డిగుమ్మి జలపాతంలో 2 మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.