అనంతపురం జిల్లా మారెంపల్లిలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కనేకల్, బొమ్మనహల్ మండలాల్లోని రైతులు నీటి వసతి గల మాగాణి భూముల్లో రబీ పంటలో పదివేల వరి సాగు చేశారు. గత 15 రోజులుగా కోతలు జరుగుతున్నాయి. లాక్డౌన్తో బహిరంగ మార్కెట్లో వరి ధరలు భారీగా తగ్గిపోయాయి.
రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రకారంంగా కేంద్రం ప్రారంభంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ వరి ధాన్యం రూ. 1830 ఉండగా, బి గ్రేడ్ రూ. 1815కు ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల నుంచి వరి కొనుగోలు వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి... అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: