'ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం' - ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించే దిశగా వైకకాపా
ప్రభుత్వ ఉద్యోగల సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన సమావేశానికి మంత్రి శంకరనారాయణ హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తీర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
Body:ATP :- రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వైకాపా కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ చెప్పారు. అనంతపురంలోని అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను మంత్రి శంకర్ నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ఎన్నికల ముందు ఏ హామీలిచ్చారో అవన్నీ అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి తనయుడుగా ఆయన కంటే మెరుగైన అభివృద్ధిని ముఖ్యమంత్రి చూపిస్తారని తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని సన్మానించారు.
బైట్స్...1... సూర్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
2....శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.