కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో కొవిడ్ బాధితులకు మంచి చికిత్స అందించే అంశంపై రాష్ట్రస్థాయి సమీక్ష అనంతరం.. జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ.. వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు.. జిల్లా అధికారులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్ రోగులు మృతి
జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి.. తొలి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. ద్రవ ఆక్సిజన్ నిల్వ ఉన్న ఆసుపత్రి నుంచి కొరత ఏర్పడిన చోటికి తరలించేందుకు.. ఖాళీ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కమిటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదించినట్లు చెప్పారు. రెమ్ డెసివిర్ను బ్లాక్ మార్కెట్లో విక్రయించేవారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. సూదుల దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. మృతులకు అంత్యక్రియలు చేసే విషయంలో.. పేదలకు సంబంధించి ప్రభుత్వమే ఖర్చుపెడుతుందని వివరించారు.
ఇదీ చదవండి: