అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు అయిన తరువాత వలస కూలీలు వందల సంఖ్యలో ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో కూలీలకు ఉపాధి లేక తిండి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఎస్ ఆర్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కవిత 50 మంది వలస కూలీలతో పాటు, పెనుకొండలోని సీపీఐ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలకు బియ్యం,నిత్యావసర సరుకులు అందజేశారు. పట్టణంలోని ఆల్ కౌసర్ సేవా సంస్థ అధ్యక్షుడు అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో పెనుకొండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది, విలేకరులు, మానసిక వికలాంగులకు, రైల్వే స్టేషన్ బస్టాండ్ తదితర చోట్ల నిలిచిపోయిన వృద్ధులకు తాగునీటి సీసాలను అందజేశారు.
ఇదీ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ర్యాండమ్ టెస్టులు