అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రముఖ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. 23వ తేదీన జరిగే మహా రథోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఎనిమిది రోజులపాటు నిర్వహించే వేడుకల్లో అడ్డపల్లకి ఉత్సవం ఎంతో ఆకట్టుకుంటుంది. కర్ణాటకకు చెందిన కళాకారుల బృందం చేసే నృత్యాలు, డబ్బు వాయిద్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. చివరిరోజు అశ్వవాహన సేవ అనంతరం వసంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చదవండి: