అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వ్యాధుల ధ్రువీకరణ కోసం ఉచిత వైద్యశిబిరం ప్రారంభమైంది. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ క్యాంపునకు జిల్లాలోని ప్రజలు భారీ సంఖ్యలో హజరయ్యారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఆదేశాల మేరకు తలసేమియా, హిమోఫిలియో, సికెల్ సెల్, దీర్ఘాకాలిక మూత్రపిండాలు, బోదకాలు, లివర్, గుండె మార్పిడి, కుఘ్ట రోగులకు చికిత్స అందించి వ్యాధుల ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. కానీ చాలా మందికి సరైన అవగాహన లేకపోవటంతో ఇతర వ్యాధులున్నవారూ ఈ శిబిరానికి తరలి వచ్చారు. వైద్యులు, సిబ్బంది... రోగులను అదుపుచేయలేకపోయారు. రోగులెవ్వరు ఆందోళన పడాల్సినవసరం లేదని, మరో రెండు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ హరే రామనాయక్ తెలిపారు.
ఇవీ చదవండి