అనంతపురం జిల్లా ధర్మవరంలో నలుగురు కార్మికులు శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని శాంతి నగర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సురేష్, గ్యాస్ ఏజెన్సీలో పని చేసే కార్మికుడు రామయ్య, మరో ఇద్దరు చేనేత కార్మికులు కృష్టప్ప, లక్ష్మీనారాయణ కలిసి.. మద్యానికి బదులు శానిటైజర్ సేవించారు. శానిటైజర్ తాగి ఇళ్లకు చేరుకున్న వీరు అపస్మారక స్థితిలోకి చేరారు. సురేష్, రామయ్యలను వారి కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కృష్టప్ప, లక్ష్మీనారాయణ ఇద్దరు వైద్యానికి నిరాకరించి ఇళ్లలోనే ఉన్నారు. నలుగురు కార్మికులు శానిటైజర్ తాగి అస్వస్థతకు గురి కావడం ధర్మవరంలో కలకలం రేపింది. మద్యం తాగేందుకు అలవాటుపడ్డ వీరు తక్కువ ధరకే లభిస్తున్న శానిటైజర్ తాగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: