ఫిలిప్పీన్స్‌లో ఐదు రోజుల క్రితం మృతి చెందిన కదిరి, అనంతపురానికి చెందిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. వారి తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించి కడచూపులైన కన్నవారికి దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు ఆవేదనతో కుమిలిపోతున్నారని ఆయన లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్‌కి మాజీ ఎమ్మెల్యే లేఖ - సీఎం జగన్ కి మాజీ ఎమ్మెల్యే లేఖ
ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సీఎం జగన్‌ని కొరారు. కన్నవారికి కడచూపులైనా దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
![ముఖ్యమంత్రి జగన్‌కి మాజీ ఎమ్మెల్యే లేఖ ముఖ్యమంత్రి జగన్‌కి మాజీ ఎమ్మెల్యే లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6758915-649-6758915-1586667576015.jpg?imwidth=3840)
ముఖ్యమంత్రి జగన్‌కి మాజీ ఎమ్మెల్యే లేఖ
ఫిలిప్పీన్స్‌లో ఐదు రోజుల క్రితం మృతి చెందిన కదిరి, అనంతపురానికి చెందిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. వారి తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించి కడచూపులైన కన్నవారికి దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు ఆవేదనతో కుమిలిపోతున్నారని ఆయన లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చూడండి:దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్థులు