లాక్డౌన్లో ప్రజలు శారీరక వ్యాయామానికి పూర్తిగా దూరమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సోకుతున్న వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారు సీ, ఈ విటమిన్లతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచించారు. వైరస్ రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విషయాలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోషకాహార విభాగం శాస్త్రవేత్త డా.సుధారాణితో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: