అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ ఆవరణలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాప్తి చెంది యూనివర్సిటీ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న గడ్డి చాలా వరకు కాలిపోయింది. మంటలను గమనించిన వర్సిటీ అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. విద్యార్థులే సిగరెట్లు కాల్చి వేయడంతో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: