ETV Bharat / state

సర్వర్ మొరాయింపులు... పెరుగుతున్న రైతుల క్యూలైన్లు - anantapuram latest news

అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వేరుశెనగ విత్తనాల కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు రైతులు బారులు తీరుతున్నారు. సర్వర్లు నెమ్మదిగా పని చేస్తుండటం వల్ల.. ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఉద్యోగులు ఎక్కువ సమయం కేటాయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

farmers waiting for register their names
పేర్లు నమోదు చేసుకొనేందుకు రైతుల క్యూ
author img

By

Published : May 18, 2020, 4:55 PM IST

రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వేరుశెనగ విత్తనాల కోసం గ్రామ సచివాలయంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు క్యూ కట్టారు. మొదటి దశలో చిన్న, సన్నకారు రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకుని టోకెన్ పొందిన తర్వాత డబ్బులు చెల్లిస్తే అధికారులు నిర్ణయించిన తేదీలో విత్తన వేరుశెనగలు పొందటానికి అవకాశం ఉంటుంది.

అయితే... రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి గ్రామ సచివాలయాలకు వెళితే అక్కడ క్యూలైన్లు చూసి బెంబేలెత్తుతున్నారు. ఇంటర్నెట్ సర్వర్లు మందగమనంతో పని చేస్తున్నాయని.. వీలైనంత ఎక్కువ సమయం కేటాయించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సచివాలయ ఉద్యోగులు తెలిపారు.

ఇవీ చూడండి:

'భరోసా కేంద్రాలతో రైతులకు అండ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.