పంటల రుణాలు రెన్యువల్ కోసం వేకువజామునే వచ్చే రైతులతో బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. అనంతపురం జిల్లా కదిరిలో పంట రుణాల రెన్యువల్ గడువు ముగుస్తుందనే భయంతో రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ శాఖ విభాగం బ్రాంచ్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులలో పంట రుణాలు రెన్యువల్ జరుగుతోంది. ఆయా ప్రాంతాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేస్తుండటంతో గ్రామాల నుంచి రైతులు వేకువజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని వరుసల్లో ఎదురుచూస్తూ తమ వంతు వచ్చేవరకు ఎండలోనే నిలబడుతున్నారు.
ఒకవైపున కరోనా భయం.. మరోవైపున గడువు ముగిసిపోతుందనే భయంతో ఎదురు చూడాల్సివస్తోందని రైతులు వాపోయారు. బ్యాంకు అధికారులు చొరవ తీసుకొని గ్రామాల వారీగా రెన్యువల్ చేస్తే బ్యాంకుల వద్ద రద్దీని తగ్గించవచ్చని అంటున్నారు.
ఇదీ చూడండి.