ETV Bharat / state

అదే వ్యథ: విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత - రైతుల నిరసన

విత్తనాల కోసం అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా రైతులు నిరీక్షిస్తున్నారు. అనంతపురంలో అర్థరాత్రే విత్తనాల కోసం కర్షకులు క్యూ కట్టారు.

అదే వ్యథ: విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత
author img

By

Published : Jul 9, 2019, 1:33 PM IST

అనంతపురంలో విత్తనాల పంపిణీ తుది అంకానికి చేరుకుంది. కొరత మాత్రం అలాగే కనిపిస్తుంది. ఓ వైపు అధికారులు విత్తన కొరత లేదని చెబుతున్నారు. రైతులు క్యూ కడుతూనే ఉన్నారు. జిల్లాలో రైతుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని ఓబుళదేవరచెరువుకు... వివిధ గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రే వచ్చారు. ఉదయం వచ్చిన రైతులు టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో... రైతులు ఆగ్రహించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... రోడ్డుపై బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలుకుబడి ఉన్నవారికే విత్తనాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆందోళన చేస్తున్న రైతులు

ఇదీ చూడండి రైతు దినోత్సవం.. పింఛన్ల సంబరం

Intro:చంద్రగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Body:ap_tpt_36_07_ex_cm_ys_jayanti_av_ap10100

పేద ప్రజలకు అండగా నిలబడి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నాయకుడు రాజశేఖరరెడ్డి అని అతను లేని లోటు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు .ఈ సందర్భంగా వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ రోజునే ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలకు కు సైకిళ్లను పంపిణీ చేశారు. రైతు దినోత్సవాన్ని చంద్రగిరిలో నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. నియోజకవర్గంలోని ఆదర్శ రైతులకు ప్రతిభ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు ప్రదర్శించిన స్టాల్ లను పరిశీలించి అవి ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశాడు.

Conclusion:పి. రవి కిషోర్ ,చంద్రగిరి.9985555913.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.