ప్రభుత్వం తమ భూములను అప్పగించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర... పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులు తిరిగివ్వాలని నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి పత్రం అందించారు.
మడకశిరా మండలంలోని సి.కొడిగేపల్లి గ్రామం వద్ద పరిశ్రమల కోసం 6 గ్రామాల రైతుల నుంచి పన్నెండు వందల ఎకరాల భూమిని, పరిగి మండలంలోని రైతుల వద్ద నుంచి 14 వందల ఎకరాల భూమిని ప్రభుత్వం తక్కువ ధరలతో సేకరించింది. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. 16 సంవత్సరాలు గడిచిన పరిశ్రమలు ఏర్పాటు కాక ఉద్యోగాలు రాక భూములు కోల్పోయి వలసలకు వెళుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నిబంధనల ప్రకారం పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో ఐదు సంవత్సరాలలోపు పనులు చేపట్టకపోతే తిరిగి ఆ భూమిని రైతులకు ఇవ్వాలని ఉంది. తమకు వేరే జీవనోపాధి లేనందున తమ భూమిని తిరిగి ఇవ్వాలని పోరాడుతున్నట్లు రైతులు పేర్కొన్నారు.
దీనిపై ఎమ్మార్వో మాట్లాడుతూ...ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని...సమస్యను ఉన్నతాధికారులకు పంపి..పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ...కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి