అనంతపురం జిల్లా కుందుర్పి సిండికేట్ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేశారు. ఈ సమయంలో వడ్డీ మాత్రమే తీసుకుని పంట రుణాలు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. మండల తెదేపా కన్వీనర్ ధనుంజయ, ఇతర నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. దీనిపై బ్యాంకు అధికారులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని, అయినా ప్రయోజనం లేదని అన్నదాతలు చెప్పారు. అందుకే నిరసనకు దిగామని వివరించారు.
ఇవీ చదవండి.. 3 రోజులు ముందుకు.. ఒక్క పూటలో మళ్లీ వెనక్కు!