కరోనా విజృంభిస్తున్నా.. బ్యాంకుల వద్ద జనం గుంపులుగా చేరుతుండడం ఆందోళన రేపుతోంది. సాధారణ ఖాతాదారులు, పంట రుణాల రెన్యూవల్ గడువు సమీపిస్తుండడంతో రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా బ్యాంకులకు వస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ కెనరా బ్యాంక్ వద్ద ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా జనం భారీగా క్యూకట్టారు.
కరోనా కర్ఫ్యూ అమలులో భాగంగా బ్యాంకు పనివేళలు కుదించారు. దీంతో బ్యాంకుల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 కర్ఫ్యూ అమలులో భాగంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పని చేస్తున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో సాధారణ ఖాతాదారులు, డ్వాక్రా మహిళలు బ్యాం కుల వద్ద బారులు తీరుతున్నారు. రైతుల పంట రుణాల రెన్యూవల్‌కు కష్టాలు అనుభవిస్తున్నారు.
నెలాఖరులోపు రుణాలు రెన్యూవల్ చేసుకున్న రైతులకు కేంద్రం అందించే ప్రోత్సాహక వడ్డీ రాయితీతోపాటు వార్షిక పంట రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు బ్యాంకుల వద్దకు భారీగా చేరుతున్నారు. బ్యాంకు అధికారులు చొరవ తీసుకొని గ్రామాల వారీగా రెన్యువల్ చేస్తే బ్యాంకుల వద్ద రద్దీని తగ్గించవచ్చని అంటున్నారు. మరోవైపు జనం భారీగా రావటంతో బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. ఎంతో బ్యాంక్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
ఇదీ చదవండి: