అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామ పరిసరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిపై రైతులతో చర్చించేందుకు కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్ ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి స్థానిక సచివాలయానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూతిమడుగు గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. తమ పొలాలు సోలార్ ప్లాంట్‌కు ఇవ్వబోమని చెప్పారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని నినాదాలు చేశారు. అధికారులు రైతులతో చర్చించి... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఇదీ చదవండీ...అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ!