అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పిడుగుపడి క్రిష్ణమూర్తి అనే రైతు మృతి చెందాడు. బాధితుడి బంధువు తెలిపిన వివరాల మేరకు తెలికి గ్రామానికి చెందిన బోయ క్రిష్ణమూర్తి పొలంలో పనులు చేస్తుండగా వర్షం రావటంతో తాటిచెట్టు కిందకు వెళ్లాడు. ఈ సమయంలో తాటి చెట్టుపై పిడుగుపడటంతో కృష్ణమూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు కృష్ణమూర్తిని వెంటనే పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతలో విషాదం... పిడుగుపాటుకు రైతు మృతి - rain news in anathapuram district
అనంతపురం జిల్లా తెలికి గ్రామంలో పిడుగుపడి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పిడుగుపడి క్రిష్ణమూర్తి అనే రైతు మృతి చెందాడు. బాధితుడి బంధువు తెలిపిన వివరాల మేరకు తెలికి గ్రామానికి చెందిన బోయ క్రిష్ణమూర్తి పొలంలో పనులు చేస్తుండగా వర్షం రావటంతో తాటిచెట్టు కిందకు వెళ్లాడు. ఈ సమయంలో తాటి చెట్టుపై పిడుగుపడటంతో కృష్ణమూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు కృష్ణమూర్తిని వెంటనే పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి