ETV Bharat / state

భూ వివాదం.. కలెక్టరేట్ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 9, 2021, 10:57 PM IST

అనంతపురం కలెక్టరేట్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన పోలీసులు... పెట్రోల్ బాటిల్​ను లాక్కున్నారు. భూమి విషయంలో తలెత్తిన గొడవలో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం కలెక్టరేట్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

అనంతపురం కలెక్టరేట్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. భార్య, తల్లి ఎల్లమ్మ తో కలిసి కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు... పెట్రోల్ బాటిల్​ను లాక్కున్నారు. మడకశిర మండలం కోడిగానిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులుకు గ్రామంలో 196/3 సర్వే నంబర్​లోని 28 సెంట్ల భూమి ఉంది. ఈ క్రమంలో మడకశిర ఎమ్మార్వో, వీఆర్వోలు రామాంజనేయులును బెదిరించి ఆ భూమిని అతని పెదనాన్నకు రాసి ఇచ్చారని బాధితులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు పట్టించుకోవడం లేదని రామాంజనేయులు తల్లి ఎల్లమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పదేళ్ల క్రితమే ఆ భూమిలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి ఖాళీ చేయాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు: జల్‌శక్తి శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.