రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఏ మాత్రం సరిగా లేవని.. మాజీ ఎంపీ, తెదేపా నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ''ఇలాంటి అరాచకాలను.. పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంది.. ఈ విషయంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి'' అని అన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జేసీపై నమోదైన కేసులో ఆయన రూరల్ పోలీస్ స్టేషన్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ పత్రాలను తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆయనను 8 గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ సంఘటనపై తెదేపా నాయకులు ఆందోళన చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన జేసీ... పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆరోగ్యం బాగా లేదని ఆహారం, మాత్రలు తీసుకుని వస్తానని చెప్పినా వినలేదని ఆరోపించారు. తమను, కార్యకర్తలను ఎంత భయపెట్టినా ఫలితం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితిపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు.
ఇవీ చూడండి...