అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురద కుంట గ్రామంలో లో టెన్షన్ తీగలపై హైటెన్షన్ తీగలు పడ్డాయి. పరిస్థితి గమనించిన శ్రీధర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి... మెయిన్ ఆపేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే.. విద్యుదాఘాతం కారణంగా టీవీలతో పాటు మరికొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇదే ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ కో అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.
ఇవీ చూడండి: