ఈబిడ్ సంస్థ ఎండీ కడియాల సునీల్‌కు రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ అనంతపురం జిల్లా కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి మోసగించాడనే నేరారోపణపై సునీల్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. కేసు విచారణ కోసం ఏడు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ అధికారులు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. సునీల్‌ను బుధవారం ఉదయం 10.30 నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు పోలీసు కస్టడీకి తీసుకోవడానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సునీల్‌ను సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకొని కర్నూల్ సీఐడీ కార్యాలయానికి తరలించారు.
రూ. లక్షకు.. రూ. 30 వేలు వడ్డీ ఇస్తానని ఆశచూపి వందలాది మందిని మోసం చేశాడు. ఈ కేసులో 21 వరకు నిందితుడికి అనంతపురం కోర్టు రిమాండ్ విధించగా.. సీఐడీ అధికారులు రిమాండ్ కు తరలించారు. సుమారు రూ. 300 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి. గత నాలుగు నెలలుగా నిందితుడు సునీల్ అజ్ఞాతంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: