అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ ఎన్ .రమ్య పలు విషయాలను వెల్లడించారు. బెలుగుప్ప ఎస్సై హారున్ బాషాని ఇబ్బంది పెట్టాలనే కుట్రతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనను చిత్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ స్పష్టం చేశారు.
ప్రత్యక్ష సాక్షులైన వంట చేసేవారు, సర్పంచి పోటీ అభ్యర్థి, అతని ఇరుగుపొరుగు వారిని, ఎస్సై వెంట వెళ్లిన సిబ్బందిని దర్యాప్తు చేశారు. ఎన్నికల నేపథ్యంలో గంగవరం గ్రామంలో కొందరు వంట చేసి ప్రజలకు పెడుతున్నట్లు ఎస్సై హారున్ బాషాకు సమాచారం వచ్చిందని.. వెంటనే సిబ్బందితో పాటు ఎస్సై ఆ గ్రామానికి వెళ్లారన్నారు. వంట చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద వస్తుందని.. విరమించుకోవాలని ఎస్సై సూచించిందని అన్నారు.
అలానే వంట ప్రక్రియ జరుగుతుండటంతో ఎమ్సీసీ కింద కేసు పెడతామని ఎస్సై హెచ్చరించారని తెలిపారు. తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తారోనని భయపడి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వంటలోకి బొగ్గు, మట్టిని ఎస్సై వేశారని ప్రచారం చేశారు. ఎస్సైని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే రూమర్స్ సృష్టించారని డీఎస్పీ తెలిపారు. అలా కావాలనే చేసిన వారిపై కూడా నిఘా ఉంచామన్నారు.
ఇదీ చూడండి. పెన్సిల్ రాస్తుంది.. మొక్కై మొలుస్తుంది!