కరోనా నేపథ్యంలో మూగజీవాలు ఆకలితో అల్లాడిపోతున్నాయి. కనీసం వాటికి తాగేందుకు నీరు అందడం లేదు. అనంతపురం పట్టణంలో మూగజీవాల దాహాన్ని తీర్చడానికి దాతలు ముందుకొచ్చారు. పట్టణంలోని ప్రైవేటు బస్సుల ఓనర్స్ అసోషియేషన్ వారు.. నీటి తొట్టెలు కొనుగోలు చేసి.. వాటిని పశుసంవర్ధకశాఖ అధికారులకు అందించారు. నగరంలో పశువులు సంచరించే 15 ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీటిని పెట్టనున్నట్లు పశు సంవర్ధశాఖ సంయుక్త సంచాలకులు సన్యాసిరావు తెలిపారు. వీటిలో నిత్యం నీరు ఉండేలా చూస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: