ETV Bharat / state

సిలిండర్‌పై అదనంగా రూ.30 వసూలు.. లక్ష పరిహారం - 30 రూపాయల సర్వీస్ ఛార్జీపై గ్యాస్ ఇష్యూ

Gas Cylinder issue: సాధారణంగా గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ బాయ్స్ సర్వీస్ ఛార్జీ కింద ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారు. నిజానికి అలా గ్యాస్ ఏజెన్సీ వారు డబ్బులు వసూలు చేయకూడదు. ఇలాంటి సందర్భమే ఒకటి అనంతపురం జిల్లాలో జరిగింది. ఓ వినియోగదారుడు రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే డెలివరీ బాయ్‌ రూ.30 అదనంగా ఇవ్వాలని కోరడంతో సదరు వినియోగదారుడు తిరస్కరించాడు. దీంతో అతను సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లాడు. దీనిపై రూ.30 అదనంగా అడగటం సేవాలోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్‌ ఏజెన్సీ రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు ఎం.శ్రీలత శుక్రవారం తీర్పునిచ్చారు.

గ్యాస్
Gas
author img

By

Published : Jan 14, 2023, 1:19 PM IST

Gas Cylinder issue: మనం ఎప్పుడైనా రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నప్పుడు డెలివరీ బాయ్ సర్వీస్ ఛార్జీ పేరిట అదనంగా డబ్బులు అడుగుతాడు. దానికి మనం కూడా ఏం ఆలోచించకుండా సరేలే అని ఇచ్చేస్తూ ఉంటాం. వాస్తవానికి అలా సర్వీస్ ఛార్జీకి డబ్బు ఇవ్వరాదు..ఎందుకంటే రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్న సమయంలోనే సర్వీస్ ఛార్జీతో సహా అన్ని కలిపి మొత్తాన్ని కలిపి చెల్లిస్తాం అందుకే మరలా మనం ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేదు.

ఇదే విధంగా అనంతపురంలో ఓ ఘటన జరిగింది.. ఓ వినియోగదారుడు తాను బుక్ చేసుకున్న రీఫిల్​కు డెలివరీ బాయ్‌ అదనంగా అడిగిన సర్వీస్ ఛార్జీ చెల్లించకపోవడంతో అతను సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లాడు. దీనిపై వినియోగదారుల కమీషన్​ని ఫిర్యాదు చేయగా సదరు గ్యాస్ ఏజెన్సీ వినియోగదారుడికి రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పువిచ్చింది.

అనంతపురం జిల్లాకి చెందిన ఓ వినియోగదారుడికి గుత్తి రోడ్డులోని హనుమాన్‌ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. ఆయన 2019 అక్టోబరు 7న ఓ రీఫిల్‌ సిలిండర్​ బుక్‌ చేసుకున్నారు. కాగా గ్యాస్ డెలివరీకి వచ్చిన డెలివరీ బాయ్‌ అదనంగా రూ.30 సర్వీస్ ఛార్జీ ఇవ్వాలని కోరాడు. దానికి తిరస్కరించిన వినియోగదారుడు ఆ మొత్తం ఇవ్వనందుకు డెలివరీ బాయ్‌ సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లాడు. దీనిపై సదరు వినియోగదారుడు పౌర సరఫరాల అధికారికి తెలియజేయడంతో తిరిగి సిలిండర్‌ను ఇంటిముందు ఉంచి వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తే.. అక్కడి అధికారులు సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని అడుగుతుంటారని సమర్థించారు. అంతే కాకుండా మరుసటి నెల ఆ వినియోగదారుడిని మరో ఏజెన్సీకి బదిలీ చేసినట్లు తెలిపారు.

ఇక ఏజెన్సీని మార్చడంపై కలెక్టర్‌కు కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అతను సిలిండర్‌ లేకపోవడంతో పడిన ఇబ్బందులను ఫిర్యాదులో పేర్కొన్నారు. వినియోగదారుల ఫోరం గ్యాస్‌ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీ చేసింది. అలాగే విచారణ చేపట్టి తీర్పునిచ్చింది. డెలివరీ బాయ్‌ను తొలగించినందున పరిహారం చెల్లించాల్సిన పని లేదని ఏజెన్సీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న తర్వాత.. ఏజెన్సీ బాధితునికి రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని ఫోరం బెంచ్‌ తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.