అనంతపురంలో ఎన్నారై మిత్రబృందం సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఎన్ఆర్ఐ జగదీశ్వర్ రెడ్డి, తెదేపా నాయకుడు పామురాయి వెంకటేష్ మిత్ర బృందం అనంతపురంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పండ్లు, అన్నం, మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనల మేరకు లాక్ డౌన్ పాటించాలని కోరారు. ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఇదీ చదవండి: