అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకుల(ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ, డిప్లొమా, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. అనంతరం నాయబ్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ గందరగోళానికి ప్రభుత్వం తెరదించి జరగాల్సిన పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లు'