కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఓ మహిళపై.. అక్కడ వైద్య సేవలు అందిస్తున్న ఎంఎన్వో అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని పాలిటెక్నిక్ కొవిడ్ కేర్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన మహిళకు కరోనా నిర్ధరణ కావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను కొవిడ్ కేర్ సెంటర్లో చేర్చారు.
ఇదీ చదవండి: కరోనాలో కొత్త లక్షణం.. 'కొవిడ్ టంగ్'
ఆమెకు చికిత్స అందించే నెపంతో.. గదిలో ఒంటరిగా ఉన్న మహిళను ఎంఎన్వో లక్ష్మీ నరసింహులు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇంఛార్జి ఎస్ఐ ప్రదీప్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: