'అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ' - దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీపై ఆళ్ల నాని ఆరా వార్తలు
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్వాహకంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల జారీ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
deputy cm alla nani on sadaram certificates issue at ananthapuram
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్వాకంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల జారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కౌంటర్లను కిందికి మార్చాలని ఆదేశించిన మంత్రి....మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికెట్లు అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీ చదవండి :
మందడంలో డ్రోన్ కలకలం... కట్టలుతెంచుకున్న ప్రజల ఆగ్రహం