మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా.. రెండో రోజు అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా.. డిగ్రీ విద్యార్థిని హరిత నామినేషన్ దాఖలు చేశారు. యువత ముందుకు వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని.. హరిత అన్నారు. తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో భాజపా తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
ఇదీ సంగతి: ఆ గ్రామాల్లో చూపుడు వేలుపై ఇంకు పడదు.. కారణమేంటంటే..?